ఆంధ్రప్రదేశ్

ఏర్గట్లమండలకేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఏర్గట్లమండలకేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

జనం న్యూస్ సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 4 లక్షల 68 వేల విలువైన చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన లబ్ధిదారులు సమర్పించిన వైద్య ఖర్చుల బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరైందన్నారు. ఈ సహాయం మంజూరయ్యేలా కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దాసరి లక్ష్మికి నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం కోసం రూ. 2 లక్షల 50 వేల విలువైన వైద్య అనుమతి పత్రం మంజూరు చేయించినట్లు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు. వైద్యం కోసం ఖర్చు చేసిన వారు ఆసుపత్రి బిల్లులను అందజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించని వారికి ఉచిత వైద్యం కోసం వైద్య అనుమతి పత్రం అవసరమైతే, వైద్యుల అంచనా వ్యయ పత్రాన్ని తీసుకువస్తే మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏలేటి మోహన్, గడ్డం జీవన్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్