ఆంధ్రప్రదేశ్

సోయా పంటలో పొలం బడి కార్యక్రమము

సోయా పంటలో పొలం బడి కార్యక్రమము

బిచ్కుంద సెప్టెంబర్ 26 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని చిన్న దేవాడ గ్రామంలో జాతీయ నూనె గింజల మిషన్ పథకంలో భాగంగా బిచ్కుంద రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోయా చిక్కుడు పంటలో సమగ్ర పంట యాజమాన్యం పై పొలం బడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రైతు బడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెద శాస్త్రవేత్త డా. రేవంత్ నాథన్ గారు మాట్లాడుతూ సోయా పంటలో విత్తనాలు వేసుకునే దశ నుంచి పంట కోత వరకు చేపట్టవలసిన వివిధ యాజమాన్య పద్ధతులు వివరించారు. సోయా పంటను ఆశించే ప్రధాన చీడపీడలు మరియు తెగుళ్ల లక్షణాలు, వాటిని నివారించడానికి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు వివరించడం జరిగింది. అదే విధంగా సోయా పంటలో సమగ్ర కలుపు యాజమాన్యం, సమగ్ర నీటి యాజమాన్యం, సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. సోయా పంటలో అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఎంచుకోవాల్సిన రకాలు, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, సస్యరక్షణ మరియు కోత సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, బిచ్కుంద రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శంకర్ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్ మరియు రైతులు పాల్గొన్నారు.

ఇ-పేపర్