జనం న్యూస్ 27 సెప్టెంబర్ ఆదివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ త్వరలో జరగబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా సిద్దిపేటకు చెందిన దాసరి పవన్ ను రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగినది దాసరి పవన్ తెలిపారు.ఈ సందర్బంగా దాసరి పవన్ మాట్లాడుతూ దళిత కుటుంబం లో పుట్టిన తనకు ఈ పదవి రావడానికి కారణమైన ప్రధానకార్యదర్శి రామ్ తాళ్లూరి రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ రాష్ట్ర నాయకత్వనికి పాదాభివందనం తెలియచేస్తూ,ఇన్ని సంవత్సరాలనుండి నాతో కలసి పనిచేస్తున్న జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగు తుందన్నారు, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు గా పనిచేస్తు,ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి గా పనిచేస్తు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు పార్టీ ని బలోపేతం కోసం ఆహార్నాశిలు కష్టపడుతున్నన్నారు.దళితుల కు బహుజనులకు అవకాశాలు కల్పిస్తున్నా పార్టీ జనసేన పార్టీ అన్నారు సామజిక న్యాయం పాటించడం కేవలం జనసేన పార్టీ కే సాధ్యమన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారిని గుర్తించి వారికీ అవకాశాలు కల్పిస్తుంది అనడానికి నాకు దక్కిన పదవే ఇందుకు నిదర్శనం అన్నారు .ఈ పదవి నాతో కలసి పనిచేస్తున్న పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులకు దక్కిన గౌరవం గా భవిస్తున్నానన్నారు.నర్సంపేట నియోజకవర్గం లో పట్టా భద్రులను సంగటితం చేసి నియోజకవర్గం లో వున్నా అందరి నాయకులను కార్యకర్తలను కలుపుకపోతూ వారితో కలసి జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గడలా శ్రీనివాస్ ను గెలించడానికి ఛాయాచేక్తుల కృషి చేస్తానన్నారు. తప్పకుండ జనసేన పార్టీ విజయం బోణి కొట్టి రాబోయే స్థానిక సంస్థల . గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంసిద్ధమవుతామన్నారు.