డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్
ఘనంగా దత్తగిరి మహారాజ్ 104వ జయంతి వేడుకలు
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 26. 09. 2026 ఝరాసంగం/జహీరాబాద్:సత్పురుషుడు, మహాయోగి, ధర్మస్థాపన కోసం కృషి చేసిన శ్రీపాద వల్లభులు, దిగంబరయోగి దత్తగిరి మహారాజ్ చూపిన ధర్మబాటలో నడుస్తామని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు, మహామండలేశ్వరులు అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. ఆయన ఆశయాల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.శనివారం దత్తగిరి మహారాజ్ 104వ జయంతి సందర్భంగా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం లో గోపూజ, గురుపాద పూజ, స్వామివారికి రుద్రాభిషేకం, రుద్ర సహిత దత్త యజ్ఞం, పూర్ణాహుతి, ప్రవచనామృతం, భజన, వస్త్ర, పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ, నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తగిరి మహారాజ్ ప్రారంభించి వేద పాఠశాల, బసవపురాణం, గోసంరక్షణ, నిత్య అన్నదానం, విశ్వమానవ ధర్మ ప్రచారం, వృద్ధాశ్రమం, అనాధ ఆశ్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో నందినిగిరి మాత, శ్రీపాద స్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, బోయిని ఎల్లన్న, నాగన్న పాటిల్, బసవరాజ్ పాటిల్, కోట శ్రీనివాస్, సంగయ్య స్వామితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.