తెలంగాణ

ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారి డి.సునంద మేడం

ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారి డి.సునంద మేడం

జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ వయోవృద్ధుల సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలి జిల్లా సంక్షేమ అధికారి సునంద మేడంజోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రెండవ రైల్వే గేట్ సమీపంలో ఉన్న ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సాధికారిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద మేడం శుక్రవారం సందర్శించారు.అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని ( సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 ) వరకు నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆమె డే కేర్ సెంటర్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాల గురించి వయోవృద్ధులకు వివరించారు. అనంతరం డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులకు అందుతున్న సౌకర్యాలు, రోజువారీ కార్యక్రమాలు, భోజన వసతులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న వయోవృద్ధులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి సమస్యలు మరియు అవసరాలపై ఆరా తీశారు. అనంతరం డే కేర్ సెంటర్ పరిసరాలను పరిశీలించిన జిల్లా అధికారి సునంద మేడం అక్కడ ఏర్పాటు చేసిన పెరటి తోటను సందర్శించారు. సెంటర్‌లో ఖాళీగా ఉన్న స్థలంలో మరిన్ని పండ్ల మొక్కలను నాటి, పచ్చదనాన్ని పెంపొందించాలని నిర్వాహకుడు మహేష్ నాయుడుతో పాటు సిబ్బందికి సూచించారు.అలాగే డే కేర్ సెంటర్‌కు మరింత మంది వయోవృద్ధులు వచ్చేలా అవగాహన కల్పించి, వారి సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. వయోవృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అవసరమైన సౌకర్యాలు అందేలా నిరంతరం చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డే కేర్ సెంటర్ నిర్వాహకులు,సిబ్బంది మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు…

ఇ-పేపర్