జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 76వ పుట్టినరోజు వేడుకలు మరియు ప్రజాప్రతినిధిగా 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జరుగుచున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విల స గ్రామంలో అంగన్వాడి టీచర్ గుత్తుల కనకదుర్గ సెంటర్లో జరుగు ఉత్సవంలో పాల్గొన్న సిడిపిఓ విజయశ్రీ గారు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది అయినా అంగన్వాడి కేంద్రాలకు మోడీ గారు ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను నిధులను తదితర విషయాలను వివరించి అంగన్వాడి టీచర్స్ ఆయమ్మలు పిల్లల పట్ల వారికి ఇచ్చే ఆహారము పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడి సిబ్బంది అందిస్తున్న నిస్వార్ధ సేవలను అభినందిస్తూ చిన్నారుల ఆరోగ్యం పోషణ అభివృద్ధిలో వారి సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బొక్క సత్యభూషణం మాజీ ఎంపీటీసీ గుర్రం రాంబాబు హై స్కూల్ చైర్మన్ అమలకట్ట చక్రవర్తి యనమల వెంకటరమణ పెండ్ర రమేష్ సరళదాసు కంచర్ల శివరామకృష్ణ అంగన్వాడి సూపర్వైజర్ సిహెచ్ జయవాణి తల్లిదండ్రులు గర్భిణీలు బాలింతలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు