జనం న్యూస్, సెప్టెంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను తాళ్లరాంపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రజక సంఘం అధ్యక్షుడు కదుర్కపు నడ్పన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం సభ్యులు మునిమాణిక్యం గంగాధర్, నేరేళ్ల దేవన్న, ఎడపల్లి దేవన్న, ఎడపల్లి బాలరాజుతో పాటు యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.