ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక రంగం దేశ,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా నిలుస్తోందని,ఉపాధి కల్పనతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తుందన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని సహజ ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు,ఆధ్యాత్మిక క్షేత్రాలు,సముద్ర తీర ప్రాంతాలు పర్యాటకులకు విశేష ఆకర్షణగా ఉన్నాయని,పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలు,మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తోందన్నారు. పర్యాటకం ద్వారా యువతకు ఉపాధి,స్వయం ఉపాధి పెరుగుతోందని,హోటళ్లు,రవాణా,హస్తకళలు వంటి రంగాలకు ఊతమిస్తోందని,పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.