వైరల్ వార్తలు

క్లాస్‌లో ఒక్కసారిగా కుప్పకూలి రెండో తరగతి బాలిక మృతి..! ఎందుకో తెలుసా..!(లైవ్ వీడియో చూడండి)

క్లాస్‌లో ఒక్కసారిగా కుప్పకూలి రెండో తరగతి బాలిక మృతి..! ఎందుకో తెలుసా..!(లైవ్ వీడియో  చూడండి)

జనం న్యూస్ | : ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపు వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాల సమీపం నుంచి వినాయకుడి ఊరేగింపు డీజే శబ్దాలతో వెళ్తున్న సమయంలో రెండో తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక క్లాస్‌రూమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నగరంలోని డివైన్ పబ్లిక్ స్కూల్‌ సమీపం నుంచి వినాయక నిమజ్జన ఊరేగింపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాలిక అస్వస్థతకు గురైన విషయాన్ని గమనించిన క్లాస్ టీచర్ వెంటనే తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలికను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలిక గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపినట్లు సమాచారం. అయితే ఊరేగింపులో వినిపించిన భారీ డీజే శబ్దాల కారణంగానే బాలిక గుండె ఆగిపోయిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలిక అస్వస్థతకు గురైన సమయంలో ఇతర విద్యార్థులు బయట నుంచి వెళ్తున్న వినాయక ఊరేగింపును చూస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో కనిపిస్తున్నాయి. అయితే కేవలం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా డీజే శబ్దమే బాలిక మృతికి కారణమని నిర్ధారించలేమని నివేదికలు పేర్కొంటున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాలిక మృతికి అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతికి డీజే శబ్దమే కారణమని పోలీసులు కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇ-పేపర్