తెలంగాణ

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు.. వైసీపీ నుంచి 500 మంది

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు.. వైసీపీ నుంచి 500 మంది

సీతాపురం, తిర్లంగి పంచాయతీల్లో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 500 కుటుంబాలు

*జనం న్యూస్ సెప్టెంబర్ 27 కోటబొమ్మాళి మండలం :టెక్కలి మండలంలోని సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలో వైకాపా పార్టీకి చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు, కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీతాపురం పంచాయతీ పరిధిలోని వీర రామకృష్ణాపురం, అలాగే తిర్లంగి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో ప్రధాన బాధ్యత అని అన్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ కృషి చేస్తోందని తెలిపారు.గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, గృహ నిర్మాణం, పింఛన్లు, రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నా మని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.టెక్కలి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తాను ఓట్లు వేసిన గ్రామాలతో పాటు, గతంలో రాజకీయంగా భిన్నంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.*44 ఏళ్లుగా టెక్కలి అభివృద్ధికి కింజరాపు కుటుంబం కృషి,టెక్కలి నియోజకవర్గంతో పాటు గతంలో ఉన్న హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో దాదాపు 44 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు అనంతరం తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. సీతాపురం పంచాయతీ పరిధిలోని సీతాపురం, వెంకటాపురం గ్రామాల్లో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల ఆయా గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించానని అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. టెక్కలి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా భిన్నంగా ఉన్న గ్రామాలతో సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఏ.ఎం.సి ఛైర్మన్ బగాది శేషగిరిరావు,వైకాపాకు చెందిన బెండి శ్రీనివాసరావు, బెండి అప్పలసూర్యనారాయణ, టి. జగ్గారావు, బెండి కామరాజు, సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ లో చేరారు.

ఇ-పేపర్