ఆంధ్రప్రదేశ్

వసుంధర పాదయాత్ర ప్రారంభం.

వసుంధర పాదయాత్ర ప్రారంభం.

పల్లకి మోస్తు పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే. బిచ్కుంద సెప్టెంబర్ 28 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం దోస్త్ పల్లి-బంగారుపల్లి గ్రామ శివారులోని శ్రీ జగద్గురు స్వామి రామానంద నరేంద్రాచార్య మహారాజ్ తెలంగాణ ఉపపీఠం నుంచి ఆదివారం వైభవంగా వసుంధర పాదయాత్ర ప్రారంభమైంది.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శ్రీ క్షేత్ర పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పల్లకి మోస్తూ పాదయాత్ర ప్రారంభించారు అనంతరం భక్తులతో కలిసి మొక్కలను నాటారు. మాజీ ఎమ్మెల్యే అరుణతార భక్తులతో కలిసి మొక్కలు నాటినారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ వినియోగం వల్ల పెరుగుతున్న కాలుష్యం, ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భూమిని కాపాడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 21న జగద్గురు నరేంద్రమహారాజ్ 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణతో పాటు నాగపూర్, నాసిక్, పర్భణి, వాసాయి, పూణే, గోవా ప్రాంతాల్లోని మొత్తం 7 ఉపపీఠాల మీదుగా 26 రోజుల పాటు సుమారు 600 కిలోమీటర్లు కొనసాగనుంది. యాత్రలో భాగంగా 6 లక్షల 18 వేల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రతిరోజూ సుమారు 25 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ యాత్రలో భగవన్నామ స్మరణ, భజనలు, ధ్యానం, సేవాభావంతో పాటు సామాజిక చైతన్య సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. స్వామివారి పవిత్ర పాదుకలను వెంట తీసుకుని సాగుతున్న ఈ యాత్ర భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు అంకితమైన మహా ఉద్యమంగా కొనసాగుతోంది. ఈ పుణ్యకార్యంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని నిర్వాహకులు కోరారు.

ఇ-పేపర్