జనం న్యూస్ సెప్టెంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన కీ||శే “పాలకుర్తి సాంబయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా తమ కుమారుడు అయిన పాలకుర్తి వెంకటేష్ 2005-06 బ్యాచ్ పదవ తరగతి” మిత్రులు ఇంటికి వెళ్ళి వారి తండ్రికి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపి ₹30,000/- వేల రూపాయలు అర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేసి ఎల్లవేళలా అండగా ఉంటాం గత 8 సంవత్సరాలనుండి తమతో పాటు చదువుకున్న 2005 10 వ తరగతి బ్యాచ్ మిత్రుల కుటుంబంలో ఎలాంటి ఆపద వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ నిలుస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గోవిందా పురం గ్రామ సర్పంచ్ స్వాతి దాసి శ్రావణ్ కుమార్, రంగు రాజేష్, కోగిల సుమన్, పైండ్ల భాను, చంద రఘుపతి, మంద మహేష్, మంద సురేశ్, వైనాల అశోక్, కూశన నరేష్, కోగిల తిరుపతి, చందా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.