జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని మండల స్థాయి ప్రజావాణిలో ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పూర్తిస్థాయిలో పనిని కల్పించ పోవడంతో బివాండి సోలాపూర్ లాంటి ప్రదేశాలలో పవర్లూమ్ కార్మికులుగా ప్రభుత్వాల నుండి ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా సంచార జీవనం గడుపుతున్నారని పనిచేసే క్రమంలో దుమ్ము దూళి నోట్లో ముక్కుల ద్వారా శరీరంలో పోయి అనేక వ్యాధులతో సతమాతమవుతున్నారని ఎలాంటి స్థిర ఆస్తులు కనీసం ఇల్లు కూడా లేకుండా జీవనం గడుపుతున్నారని అన్నారు ప్రస్తుతం పింఛన్ దరఖాస్తు చేసుకున్న వారి నుండి విచారణ చేస్తున్నారు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా వారి స్థితిగతులు పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతి పద్మశాలీలకు జియో టాక్ తో సంబంధం లేకుండా 50 సంవత్సరాలు నిండిన అర్హులైన వారికి చేనేత పింఛన్ మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.