ఆంధ్రప్రదేశ్

ఎరువుల దుకాణాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన ఏ ఓ ప్రియదర్శిని

ఎరువుల దుకాణాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన ఏ ఓ ప్రియదర్శిని

జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల వ్యవసాయ అధికారి ఏ ఓ మార్క ప్రియదర్శిని అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, రికార్డులు, కొనుగోలు–అమ్మకపు బిల్లులు, గ్రౌండ్ స్టాక్ ఎరువుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలలో డీలర్ లైసెన్స్‌లో నమోదు కాని ఎరువుల ఉత్పత్తులను గుర్తించి, వాటి విక్రయాలను నిలిపివేస్తూ సంబంధిత డీలర్లకు స్టాప్ సేల్ నోటీసులు జారీ చేశారు. డీలర్లు తమ లైసెన్స్‌లో నమోదైన ఎరువులనే విక్రయించాలని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్‌లో నమోదు కాని ఉత్పత్తులను విక్రయించినట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత డీలర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఇ-పేపర్