ఆంధ్రప్రదేశ్

దివంగత ప్రతాప్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం ఘన నివాళి

దివంగత ప్రతాప్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం ఘన నివాళి

జనంలో సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 29. 09. 2026 పస్తాపూర్: దివంగత శ్రీ ప్రతాప్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పస్తాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ప్రతాప్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నరోత్తం మాట్లాడుతూ, దివంగత ప్రతాప్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాల్లో ఆయన అందించిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ప్రజా సేవలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శుక్లా వర్ధన్ రెడ్డి, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు నామా రవి కిరణ్, గోపాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లేష్, పవన్ రాథోడ్ తదితరులు పాల్గొని దివంగత ప్రతాప్ రెడ్డికి నివాళులర్పించారు.

ఇ-పేపర్