ఆంధ్రప్రదేశ్

క్రీడా మైదానంలో సత్తా చాటిన ప్రత్యేక విద్యార్థులు

క్రీడా మైదానంలో సత్తా చాటిన ప్రత్యేక విద్యార్థులు

జనం న్యూస్ సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు, ఏర్గట్లమండల కేంద్రంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. డ్రాయింగ్‌, 100 మీటర్ల పరుగు, స్పూన్‌–మార్బుల్‌, మ్యూజికల్‌ చైర్స్‌, బ్రిక్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొనడం ఆకట్టుకుంది. గెలుపోటముల కంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, సమానత్వ భావన పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేశ్వర్, మండల సముదాయ ప్రధానోపాధ్యాయుడు కోమరగిరి కృష్ణాచారి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. భవిత పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించిన గోడిసెల ప్రశాంతికి ప్రత్యేక ఉపాధ్యాయుడు బి. ఉదయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఇ-పేపర్