బిచ్కుంద సెప్టెంబర్ 29 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో దోబీ వాడలో అంగన్ వాడి కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో అంగాన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్లకు, సిబ్బందికి సన్మానించారు బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ. చిన్నారులకు ఆరోగ్యం, పోషణ, విద్య, కోసం అంగన్ వాడీ టీచర్లు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందన్నారు అనంతరం విద్యార్థులకు గర్భిణి స్త్రీలకు, గుడ్లు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి భూత అధ్యక్షులు రాజిరెడ్డి, మసాని సంతోష్, బిజెపి సీనియర్ నాయకులు జుట్టు సాయిలు, గాన్న సంతోష్ రెడ్డి, కర్కాల్ నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.