ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు

జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు

నాశా ముక్త్ భారత్ కార్యక్రమం జనం న్యూస్ సెప్టెంబర్ 29 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని టీ ఎస్ ఎన్ ఆర్ జిల్లా బాలుర పరిషత్ పాఠశాల లో సోమవారం జరిగిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేపట్టిన నశా ముక్త్ భారత్, కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి, ఆదేశాలమేరకు స్థానిక ప్రభుత్వ వైద్యార్థికారిని డాక్టర్ శిరీష, సూచనలతో బీబీపేటలోని స్థానిక ప్రభుత్వ టి ఎస్ ఎన్ ఆర్ జిల్లా పరిషద్ బాలుర పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు మతుపదార్థాలు, మాదకద్రవ్యాలు వాటి దుష్ప్రభావాలు వివరించి. అవగాహన కల్పించి వాటినుండి జీవితకాలం దూరంగా ఉండాలని తెలియజేసి, విద్యార్థుల చేత నశా ముక్త్, యువత నశా ముక్త్ భారత్, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కార్యకర్తలు హరిప్రసాద్, సుందరమ్మ, ఆశా కార్యకర్తల జ్యోతి, మణెమ్మ, గంగజ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర రెడ్డి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇ-పేపర్