తెలంగాణ

ఐదు లక్షల రూపాయలకు వినాయకుడి లడ్డూ కైవసంలడ్డూ వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు

ఐదు లక్షల రూపాయలకు వినాయకుడి లడ్డూ కైవసంలడ్డూ వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు

జనం న్యూస్ సెప్టెంబర్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి బజరంగ్ టెంపుల్ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని మండపం వద్ద లడ్డూ వేలం పాట భక్తిశ్రద్ధల మధ్య ఉత్సాహంగా జరిగింది. వేలం పాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.చివరకు కుర్మయ్యగారి ఆనంద్ రావు రూ.5 లక్షలు వెచ్చించి వినాయకుడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు.వినాయకుడి లడ్డూను వేలం ద్వారా కైవసం చేసుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆనంద్ రావు తెలిపారు. భక్తుల విశ్వాసం, ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.వేలం కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు సహకరించారు.

ఇ-పేపర్