ఆంధ్రప్రదేశ్

మెట్‌పల్లి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా చీటి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు

మెట్‌పల్లి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా చీటి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు

జనం న్యూస్, సెప్టెంబర్ 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణలో ఈ రోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మన తెలంగాణ దినపత్రిక జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చీటి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలను మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు, తోటి పాత్రికేయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీనివాస్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి పరస్పరం ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో శ్రీనివాస్ రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు పాత్రికేయుల సంక్షేమం కోసం ఆయన మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారు దాసం కిషన్, క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పింజరి శివకుమార్, పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్, యానం రాకేష్, రఫీ ఉల్లా, సోహెల్, హైమద్, ముత్యాల రమేష్, బొల్లం రాజు, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, సభ్యులు ఆదిల్ పాషా, రమణ, శశికుమార్, అమ్ముల ప్రవీణ్, సమీర్ అలీ, తెలుకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్