ఆంధ్రప్రదేశ్

పాపిరెడ్డి నగర్‌లో ఘనంగా వినాయక పూజా కార్యక్రమం

పాపిరెడ్డి నగర్‌లో ఘనంగా వినాయక పూజా కార్యక్రమం

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష జనం న్యూస్, సెప్టెంబర్ 25
తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ డివిజన్ పాపిరెడ్డి నగర్ రోడ్డు నంబర్ 4సీ బ్లాక్‌లో గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర నగర్ డివిజన్ పాపిరెడ్డి నగర్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకుడు గడ్డం రాజేశ్వర్ రెడ్డి, చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. మహా విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడు కరుణించాలని ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణారెడ్డి, మాయ రాజయ్య, డాకూరి అక్కిరెడ్డి, కర్ల తిరుపతిరెడ్డి, ఎడ్ల సంపత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వంగూరి శరత్ రెడ్డి, వంగర శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల సాయిరెడ్డి, అన్నారపు బాల్ రెడ్డి, రాము గౌడ్‌తో పాటు పలువురు యువ నాయకులు, వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇ-పేపర్