ఆంధ్రప్రదేశ్

గాజువాక–యలమంచిలి రహదారి విస్తరణ పై చర్చించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

గాజువాక–యలమంచిలి రహదారి విస్తరణ పై చర్చించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్, సెప్టెంబర్ 25,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్‌టిబిఎల్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద సంబంధిత రహదారి అభివృద్ధి అధికారులతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమావేశమయ్యారు. లమంచిలి నియోజకవర్గ పరిధిలో గల గాజువాక–యలమంచిలి రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదించిన రహదారి అభివృద్ధి పనులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు, సాంకేతిక అంశాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, పనుల ప్రణాళిక తదితర అంశాలపై అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. రహదారి విస్తరణతో ఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉందని చర్చించారు

ఇ-పేపర్