జనం న్యూస్ సెప్టెంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో విఘ్నేశ్వరుని నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీ జే ఏర్పాటు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు వివరాల్లోకి వెళితే విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమంలో రేగొండ మండలం లోని నిజాంపల్లి గ్రామానికి చెందిన డీ జే నిర్వాహకుడు చింతల సురేష్ డీ జే ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసులు వెంటనే వెళ్లి డీ జే వాహనం టీ ఎస్ 27 టీ 1906 ను సీజ్ చేసి సురేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలియజేశారు విఘ్నేశ్వరుని నిమజ్జనాల సందర్భంగా ఎక్కడా డీ జే లకు అనుమతి లేదని ఎస్సై స్పష్టంగా తెలిపారు నిబంధనలు ఉల్లంఘించి డీజే లు ఏర్పాటు చేస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.