ఆంధ్రప్రదేశ్

వాసుదేవ్ సహకార బ్యాంకు రెండో వార్షికోత్సవం ఘనంగా

వాసుదేవ్ సహకార బ్యాంకు రెండో వార్షికోత్సవం ఘనంగా

జనం న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వాసుదేవ్ సహకార బ్యాంకు రెండో వార్షికోత్సవ వేడుకలు జీడిమెట్లలోని శుభం హోటల్‌లో బ్యాంకు చైర్మన్ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి హాజరై బ్యాంకు చైర్మన్, సిబ్బంది, ఖాతాదారులు, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ. బ్యాంకు చైర్మన్ రామారావు గత రెండేళ్లుగా ఎంతో శ్రమిస్తూ ఖాతాదారుల నుంచి పొదుపు మొత్తాలను సమీకరించడంతో పాటు అవసరమైన వారికి రుణాలు అందించడంలో, వాటిని సక్రమంగా తిరిగి వసూలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సుమారు 90 శాతం వరకు రుణాలు అందించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఖాతాదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి నమ్మకాన్ని పొందడం వల్ల కేవలం రెండేళ్ల వ్యవధిలోనే వాసుదేవ్ సహకార బ్యాంకు సుమారు ఐదు వేల మంది ఖాతాదారులను సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. బ్యాంకు సేవలను గుర్తించి ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ సహకార బ్యాంకుగా పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. వాసుదేవ్ సహకార బ్యాంకు భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించాలని జనంపల్లి పురేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ రామారావుతో పాటు సిబ్బంది, డైరెక్టర్లు, పొదుపుదారులు, ఖాతాదారులకు పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు, డైరెక్టర్లు, సిబ్బంది, ఖాతాదారులు, పొదుపుదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్