ఆంధ్రప్రదేశ్

కోటబొమ్మాళి కొత్తమ్మవారి జాతర ప్రసాదాల తయారీకి కొటేషన్ల ఆహ్వానం

కోటబొమ్మాళి కొత్తమ్మవారి జాతర ప్రసాదాల తయారీకి కొటేషన్ల ఆహ్వానం

జనం న్యూస్ సెప్టెంబరు 26 కోటబొమ్మాళి మండలం:శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కొత్తమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు (2026-27) పురస్కరించుకుని, ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీ నిమిత్తం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి వాకచర్ల రాధాకృష్ణ కొటేషన్లను ఆహ్వానించారు.ఈ ఉత్సవాలు అక్టోబర్ 13 నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్దేశించిన దిట్టం ప్రకారం అవసరమైన సరుకులు (రసవర్గములు) సరఫరా చేయడంతో పాటు గ్యాస్, వంట సామగ్రితో సహా లడ్డూ, పులిహోర ప్రసాదాలను తయారు చేసి అమ్మవారి ప్రసాద విక్రయ కౌంటర్లకు అప్పగించాల్సి ఉంటుంది.ఆసక్తి గల కాంట్రాక్టర్లు/వ్యాపారులు దేవస్థానం కార్యాలయ పనివేళల్లో తమ కొటేషన్లను అందజేయాల్సిందిగా ఆలయ ఈవో ఒక ప్రకటనలో కోరారు.

ఇ-పేపర్