ఆంధ్రప్రదేశ్

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా వీరమల్ల రమశ్రీ

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా వీరమల్ల రమశ్రీ

జనం న్యూస్ 28 సెప్టెంబర్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ Regd. No. 1094/24 సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ గా సేవలందిస్తున్న శ్రీమతి వీరమల్ల రమశ్రీ తెలంగాణ రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 27, 2026న హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం నుండి అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డా. చంటి ముధిరాజ్ సార్, సూర స్రవంతి మరియు మల్లం వెంకటేశం సమర్థ నాయకత్వంలో సంస్థను మరింత బలోపేతం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రమశ్రీ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమశ్రీ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సూర స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్