ఆంధ్రప్రదేశ్

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన టి పి యు ఎస్ సభ్యులు

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన టి పి యు ఎస్ సభ్యులు

జనం న్యూస్ సెప్టెంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి టి పి యు ఎస్ టి పి ఆర్ యు ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని, అలాగే వరంగల్ జిల్లాలో కొత్తగా నిర్మించబోయే విమానాశ్రయానికి బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టి పి యు ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రేమ్ సాగర్, టి పి యు ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి, సహాధ్యక్షులు బొద్దున వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాస్, కోశాధికారి బూర తిరుపతయ్య, ప్రచార కార్యదర్శి కోడూరి రమేష్, గడ్డం రాజ్ కుమార్, సిరిపురం శేఖర్, వడ్నాల వెంకటస్వామి, ములుక శ్రీనివాస్, టి పి ఆర్ యు ఎస్ జిల్లా అధ్యక్షులు బిట్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండు కామేశ్వరరావు, నాయకులు పాశికంటి చంద్రశేఖర్, గజ్జెల్లి రవీందర్, గుర్రపు సుధాకర్ రావు, పడాల సోమయ్య, చిమ్మని రాజన్ బాబు, కొండాబత్తుల రాజేంద్రం, దేవులపల్లి సదానందం, ఆముదాల భాస్కర్, గొల్లపల్లి విద్యాసాగర్, గజ్జెల్లి కోటేశ్వర రావు, ములక సాంబయ్య, ఎలగం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్