జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబరు 29 నందలూరు మండలం లోని ఆటో డ్రైవర్లకు నందలూరు ఎస్.ఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహనానికి సంబంధిం చిన అన్ని రికార్డులు, ధ్రువపత్రాలను అందు బాటులో ఉంచుకోవాలని అలాగే నందలూరు బస్టాండ్ కూడలిలో ఆటో లను ఇష్టానుసారంగా నిలిపి ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బం దులు కలిగించకూడదని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించ కుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. నిబంధ నలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ స్పష్టం చేశారు.కౌన్సెలింగ్ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.