ఆంధ్రప్రదేశ్

అండర్ 14 అండర్ 17 విభాగాలలో జరగనున్న మండల స్థాయి సెలక్షన్స్

అండర్ 14 అండర్ 17 విభాగాలలో జరగనున్న మండల స్థాయి సెలక్షన్స్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబరు 29 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) నందలూరు మండల శాఖ ఆధ్వర్యం లో బుధ, గురువారాలలో మండల స్థాయిఎంపికలు జరగనున్నాయని కోఆర్డి నేటర్ ఎన్ గౌరీ సోమ వారంతెలిపారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యా యులతో ఆమె సమావేశంనిర్వహించారు రాయచోటి డిప్యూటీ డీఈవో ఎల్ నాగయ్య, ప్రధానోపాధ్యా యులు గంగనపల్లి వెంకట రమణ ఈ సమావేశానికి విచ్చేసి ప్రసంగించారు.మండలంలోని అన్ని పాఠశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా సెలక్షన్స్ జరుగు నున్నాయ న్నారు. కబడ్డీ, వాలీబాల్, యోగా, బ్యాడ్మిం టన్, ఖో, ఖో‌, చెస్ పోటీలతో పాటుఅథ్లెటిక్స్ జరుపనున్నా మని పేర్కొ న్నారు. ఈ కార్య క్రమంలో వ్యాయామ ఉపాధ్యా యులు సురేంద్ర, తేజ, పెంచ లయ్య, గౌతమి, తేజస్విని, శివశంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్