జనం న్యూస్ 29 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్గ ద్వాల: అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టనున్న బీసీ రాజ్యాధికార యాత్రకు సీపీఐ పార్టీ మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు గంగాధర్ కోరారు. ఈ సందర్భంగా గంగాధర్ సీపీఐ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ని కలిసి బీసీ రాజ్యాధికార యాత్ర లక్ష్యాలు ఉద్దేశాలను వివరించారు. బీసీలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న యాత్రకు సీపీఐ పార్టీ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దీనిపై సీపీఐ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు స్పందిస్తూ ఈ విషయంపై తమ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో చర్చలు జరిపిన అనంతరం నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీల హక్కులు రాజ్యాధికార సాధన కోసం చేపడుతున్న బీసీ రాజ్యాధికార యాత్రకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నామని గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ యు. రాముడు వడ్డేపల్లి మండల అధ్యక్షుడు మహేష్, మధుర్ లక్ష్మణ్ సిపిఐ నాయకులు న్యాయవాది రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆశన్న ఎ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.