ఆంధ్రప్రదేశ్

నిమ్మాడ పశువైద్యశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ

నిమ్మాడ పశువైద్యశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ సెప్టెంబరు 30 కోటబొమ్మాళి మండలం :నిమ్మాడ పశువైద్యశాలను టెక్కలి పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా. చందక నరసింహులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాఖాపరమైన కార్యక్రమాల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు.కృత్రిమ గర్భధారణ వివరాలను అదే రోజు పోర్టల్‌లో నమోదు చేయాలని, భారత్‌ పశుధన్‌ యాప్‌లో ఆధార్‌ నవీకరణ, చూడి పరీక్షలు, దూడల జనన వివరాల పెండింగ్‌లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సబ్సిడీ పశుగ్రాస విత్తనాలను రైతులకు పంపిణీ చేసి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని, పశుభీమా రిజిస్ట్రేషన్లలో 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. ఇంటింటికీ పశుగ్రాస అంచనా సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు.డిస్పెన్సరీ, మందుల నిల్వలు, ఓపీ, చికిత్స, హాజరు రిజిస్టర్లను పరిశీలించిన డీడీ.. రైతులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది అందుబాటులో ఉండి, కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించాలని, టీకాలు, కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను 100 శాతం సాధించాలని సూచించారు. తనిఖీలో పశువైద్యాధికారి డా. ఎల్‌. కిరణ్‌కుమార్‌, సిబ్బంది డోల శ్రీకర్‌ పాల్గొన్నారు.

ఇ-పేపర్