ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుదాం : ప్రెస్​ క్లబ్​ అధ్యక్షుడు బాలవర్దన్

జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుదాం : ప్రెస్​ క్లబ్​ అధ్యక్షుడు బాలవర్దన్

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 30-09-2026 జర్నలిస్టుల హక్కుల కోసం ఎంత దాకా అయినా పోరాటం చేద్దామని పెబ్బేరు ప్రెస్​ క్లబ్​ అధ్యక్షుడు బాలవర్ధన్​ అన్నారు. అక్టోబరు 2న ఇండియన్​ జర్నలిస్టు యూనియన్​ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐజేయు అనుబంధంగా ఉన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాకేంద్రాల్లో జిల్లా శాఖల సమక్షంలో అధ్యక్ష, కార్యదర్శులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం పెబ్బేరు ప్రెస్​ క్లబ్​లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు, తదితర ముఖ్య నాయకులు మాట్లాడారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​ వద్ద నిర్వహించున్న నిరసన కార్యక్రమానికి పెబ్బేరు ప్రెస్​ క్లబ్​ తరఫున జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండిగులో ఉన్న ఇళ్ల స్తలాల సమస్య, నెల వారీ పారితోషకాల గురించి, జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో యూనియన్​ చేపట్టిన జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్​ జనరల్​ సెక్రటరీ పరుషరామ్​, యూనియన్​ నియోజకవర్గ జనరల్​ సెక్రటరీ బాలరాజు, క్లబ్​ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, కిరణ్​ కుమార్​ గౌడ్​, నాయకులు రాజేంద్రప్రసాద్​, అతీఖ్​ పాషా, మన్నెం, రాంబాబు, నాగరాములు, తరుణ్​, లక్ష్మీనారాయణ, రమేష్​, విభూది కుమార్​, భాస్కర్​, ఎల్లస్వామి, చెంద్రాయుడు, కృస్ణ, రామకృష్ణ, బుచ్చన్న, ఎం. గోపాలకృస్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్