జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 2. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీకే ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జహీరాబాద్‌లోని సంఘమిత్ర రోడ్డులో అపోలో ఫార్మసీ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌లో నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో లభించే ధరలతో పోలిస్తే తక్కువ ధరలకు వివిధ రకాల నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కుటుంబ అవసరాలకు ఉపయోగపడే పలు రకాల సరుకులు ఒకే చోట అందుబాటులో ఉండటంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులను అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. జహీరాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.