ఆంధ్రప్రదేశ్

మహాత్మునికి ఘన నివాళులు

మహాత్మునికి ఘన నివాళులు

జనం న్యూస్, అక్టోబర్ 02, అచ్యుతాపురం : అచ్యుతాపురంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ నాయకులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా అచ్యుతాపురం మాజీ సర్పంచ్ కూండ్రఫు విమలా నాయుడు మాట్లాడుతూ మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి బాపూజీ చూపిన శాంతి, సహన, సత్య మార్గంలో పయనిద్దామని, గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత సాధించి, ఆ మహాత్ముని ఆశయాల సాకారానికి కృషి చేద్దామని’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ద్వారపురెడ్డి బాబ్జి, కె. నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్