జనం న్యూస్ అక్టోబర్ 2 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఐజేయు పిలుపుమేరకు శుక్రవారం రోజున పట్టణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు జర్నలిస్టులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ కుర్షిత్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ కోరుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజేయూ భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాలకు అందరూ సహకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తోట మల్లయ్య, కొరటూరి ఉపేందర్, బైరి విశ్వనాథం, సామల సిద్ధులు, చింతకింది వెంకటేష్, సందెన శంకర్, పోతుగంటి సంపత్ కుమార్, మహమ్మద్ జహంగీర్, మంచెన మల్లేశం, ముళ్లెకల రవి తదితరులు పాల్గొన్నారు.