జనం న్యూస్ 02 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్గాం ధీ–శాస్త్రి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం సత్యం అహింస మార్గంలో గాంధీజీ జై జవాన్–జై కిసాన్తో శాస్త్రి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిందనూరు ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ సత్యం అహింసను నమ్మి వాటినే ఆయుధాలుగా చేసుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు గాంధీజీ కలలుగన్న మాదకద్రవ్యాలు మద్యపానం లేని సమాజం మహిళలకు భద్రతతో కూడిన స్వేచ్ఛ గ్రామీణాభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు మహనీయుల జీవితాలు ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని నిత్య జీవితంలో ఆచరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇన్ఛార్జ్ యు రాముడు అయిజ మండల రైతు సంఘం అధ్యక్షుడు రంగు తిప్పారెడ్డి, అయిజ మండల ప్రధాన కార్యదర్శి రాజపురం ఇ సురేందర్ గౌడ్ జుంజు కృష్ణ కే.రాముడు నర్సన్న గబ్రేల్ నర్సిములు వినోద్ యాదవ్ కృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.