జనం న్యూస్ 02 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్బి జెపి అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురం దేవ బండ మరియు బింగి దొడ్డి గ్రామాల పొలాలు పర్యటించి అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ
రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి రైతు భీమా ప్రీమియం తక్షణమే చెల్లించాలి ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం రాష్ట్రం లో తక్షణమే ప్రవేశపెట్టాలి రైతులకు ఇన్పుట్ సబ్సీడీ తక్షణమే ఇవ్వాలీ జోగులాంబ గద్వాల జిల్లాలో గత 4 మాసాల నుంచి పూర్తి వర్ష కాలం వర్షపాతం అత్యంత లోటుగా నమోదైనట్లు ఐ యం డి ప్రకారం నమోదైనది జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయినవి ఉదాహరణగా ప్రత్తి పంట విషయంకి వస్తే ప్రతి ఎకరాకు కనీసం 20 కేజీలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి పంట పెద్ద ఎత్తున నష్టం జరిగినది తెలంగాణ రాష్ట్రంలో ఐ యం డి ప్రకారం 17% లోటు వర్షపాతంగా నమోదు అయినది జోగులాంబ జిల్లా విషయానికి వస్తే 33 జిల్లాలలో నే అత్యంత లోటు వర్షపాతం జోగులాంబ గద్వాల జిల్లాలో 41.3% లోటు నమోదు అయినది కాబట్టి తక్షణమే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు వివిధ బ్యాంకు ద్వారా తీసుకున్న ఋణాన్ని పూర్తిగా మాఫీ చేయాలని అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డ్రిప్పు కానీ స్పింక్లర్స్ 100% సబ్సిడీతో రైతులకు అందజేయాలని దానితోపాటు కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్ డి యస్ కు నీళ్లు పంట చేతికి వచ్చేంతవరకు నీళ్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు దీనితోపాటు తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతు బీమా ప్రీమియం తక్షణమే చెల్లించాలని పై సమస్యలన్నీ పూర్తయినంతవరకు రైతులతో కలిసి పోరాటం ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ అధ్యక్షులు తెలుగు నరసింహ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ నాయకులు బింగిదొడ్డి లక్ష్మన్న, ప్రదీప్ శెట్టి శ్రీకాంత్ ముదిరాజ్ తిమ్మారెడ్డి రజక నరసింహులు వీరన్న మరియు రైతులు పాల్గొన్నారు.