ఏజెంట్ల సంక్షేమానికి కృషి చేస్తా: ఏ.నాగభూషణం జనం న్యూస్, అక్టోబర్ 08: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎల్ఐసీ శాఖ భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏ.నాగభూషణ్, ప్రధాన కార్యదర్శిగా మర్రి భాస్కర్, కోశాధికారిగా వాసాల వినయ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాగభూషణ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఏజెంట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్ల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఏజెంట్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రధాన కార్యదర్శి మర్రి భాస్కర్, కోశాధికారి వాసాల వినయ్తో కలిసి ఐక్యంగా పనిచేస్తానని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని నాగభూషణ్ కోరారు.