ఆంధ్రప్రదేశ్

కూకట్‌పల్లి నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ చన్ను పాషాకు ఘన సన్మానం

కూకట్‌పల్లి నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ చన్ను పాషాకు ఘన సన్మానం

జనం న్యూస్ అక్టోబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్‌గా నియమితులైన మొహమ్మద్ చన్ను పాషా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టి పి సిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్‌లో బండి రమేష్ మొహమ్మద్ చన్ను పాషా కి శాలువా కప్పి, స్వీట్లు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మైనారిటీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మరియు పార్టీకి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, నవాజ్ ,పాషా, అక్బర్, సచిన్, బర్కత్ అలీ, ప్రసన్న కుమార్, అస్లాం, పర్వేజ్, రమణ, ఖాజా, రమాదేవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్