పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం జనం న్యూస్ 09 నవంబర్ వికారాబాద్ జిల్లా :- పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామ పంచాయతీలో “ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని లబ్ధిదారులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి వద్ద కుటుంబ సమేతంగా గ్రామ నాయకులతో కలిసి దీపాలు వెలిగించి, పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ. పేదలకు గూడు కల్పించి వారి జీవితాల్లో నిజమైన దీపావళి వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, ఆత్మా (ATMA) కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మోహిద్, గట్టుపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొల్లి సామేల్, మంజుల, అనంతమ్మ, సాధక్, గ్రామ నాయకులు అబ్రహం, దాసు, జీవన్, మహిమూద్, మన్ను, వార్డ్ నెంబర్లు చంద్రశేఖర్, రవి, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.