జనం న్యూస్ నవంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మండలం మందారిపేట గ్రామంలో వల్లెపు శోభా దేవి దిలీప్ దంపతుల నూతనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాడని అన్నారు. పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, ఒక పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే సొంత చిరునామా అని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పానికి ఇందిరమ్మ ఇళ్లు నిదర్శనమని అన్నారు. ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, సిరిసంపదలు, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన స్థానిక గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.