ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేసిన నర్సిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేసిన నర్సిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ 17 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్కు లం పేరుతో దూషించి దాడి చేయడం అమానుషం ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు జమ్మిచేడు కార్తీక్జి ల్లా కలెక్టర్‌కు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం పోగుంట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న తిమ్మప్పపై దాడి చేసి కులం పేరుతో దూషించిన నర్సిరెడ్డి అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు జమ్మిచేడు కార్తీక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో గ్రామంలో నీటి సరఫరా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు తిమ్మప్పను నర్సిరెడ్డి అనే వ్యక్తి అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కులం పేరుతో అవమానిస్తూ దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ దాడిలో తిమ్మప్ప చెవి నుంచి రక్తస్రావం జరిగి సుమారు ఐదు నిమిషాల పాటు స్పృహ కోల్పోయినట్లు వివరించారు. గ్రామ ప్రజలకు సేవలందిస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై దాడులు చేయడం, కులం పేరుతో దూషించడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం దారుణమని అన్నారు. కార్మికులు ఆత్మగౌరవంతో, ఎలాంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు పారిశుద్ధ్య కార్మికుడు తిమ్మప్పపై దాడి చేసిన నర్సిరెడ్డిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధిత కార్మికుడికి న్యాయం చేసి రక్షణ కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులను బెదిరిస్తూ విధులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలి. కార్మికుల విధుల నిర్వహణలో అనవసర జోక్యాన్ని అరికట్టాలి. ఈ కార్యక్రమంలో కొండాపురం నర్సింలు తిమ్మప్ప కర్ణప్ప పరమేశు భజరప్ప తదితరులు పాల్గొన్నారు కార్మికుల హక్కులు ఆత్మగౌరవం కోసం ఐఎఫ్‌టీయూ నిరంతరం పోరాడుతుందని జమ్మిచేడు కార్తీక్ స్పష్టం చేశారు.

    ఇ-పేపర్