జనం న్యూస్ 18 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఆ శా కార్యకర్తలను ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఆహ్వానించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహవివి నరసింహ డిమాండ్ చేశారు మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆశ వర్కర్ల జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ప్రభుత్వం 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తామని అర్హులైన ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పిస్తామని మట్టి ఖర్చులకి 30,000, ఇన్సూరెన్స్ 50 లక్షలు కల్పిస్తామని తదితర అనేక హామీలు ఇచ్చిందని అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాలపై అణిచివేతలు కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ రాష్ట్ర మంత్రులు,అధికార యంత్రాంగం జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులకు సమ్మె నోటీసులు సైతం అందజేశామన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు సమ్మె నోటీసులు ఇచ్చిన యూనియన్ నాయకత్వాన్ని పిలిచి ఎటువంటి చర్చలు జరపలేదన్నారు.ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలపట్ల గాని ప్రజా ఆరోగ్యం పైన గాని ఎటువంటి చిత్తశుద్ధి లేదని, అందుకనే ఆశా లను చర్చలకు ఆహ్వానించకుండా సమస్యను తీవ్రం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలను చర్చలు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించెంత వరకు నిరవధిక సమ్మెను ఆపబోమని హెచ్చరించారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేదాక నిరవధిక సమ్మె చేయవల్సిందేనని సమావేశంలో ఏకగ్రీవంగా ఆశా కార్యకర్తలు తీర్మానించారు.కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ,సునీత జిల్లా కోశాధికారి కాంతమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ,చెన్నమ్మ, సహాయ కార్యదర్శులు సరస్వతి శ్రీదేవి ఆశాలు సరస్వతి పుష్పవతి అనసూయ మమత నాగేశ్వరీ పద్మ సునీత రాధ పాల్గొన్నారు.
ధన్యవాదాలతో సునీత ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా.