ఆంధ్రప్రదేశ్

చేనేత సహకార సంఘంలో 65 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు

చేనేత సహకార సంఘంలో 65 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో 65 వ వార్షికోత్సవం సందర్భంగా చేనేత సంఘం అధ్యక్షులు బాసాని ప్రకాష్ చేనేత సహకార జెండా ను ఆవిష్కరించారు చేనేత సంఘం ఉపాధ్యక్షులు దిడ్డి రమేష్ జాతీయ జెండా ను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం చేనేత సహకార సంఘం స్థాపికులు కీ,,శే,, బాసాని కైలాసం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వనం దేవరాజు కోశాధికారి బాసాని నవీన్ డైరెక్టర్లు సామల రవీందర్ వల్పదాస్ స్వరూపం బాసాని బాలకృష్ణ తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వంగరి సాంబయ్య చేనేత సంఘం కార్మికులు బూర లక్ష్మీనారాయణ బాసాని విద్యాసాగర్ గోనె వెంకటేశ్వర్లు రంగు ఆనందం నామని వెంకట నారాయణ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్