ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం.. టీడీపీలోకి వైకాపా శ్రేణులు

చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం.. టీడీపీలోకి వైకాపా శ్రేణులు

హెచ్‌.ఎన్‌.పేటకు చెందిన 50 కుటుంబాలు. 150 మంది కార్యకర్తల చేరిక జనం న్యూస్ సెప్టెంబర్ 30 కోటబొమ్మాళి మండలం :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతోందన్న విశ్వాసంతో వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.సంతబొమ్మాళి మండలం హెచ్‌.ఎన్‌.పేటకు చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన 150 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు తెలిపారు.మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీడీపీపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి పార్టీలో జరుగుతున్న చేరికలు నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించి ప్రజాసేవలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.టీడీపీలో చేరిన వారిలో సీరపు నరసింహమూర్తి, సీరపు దశరథరావు, విజ్ఞ చిన్నారావు, పలివెల మనోహరరావు, గజిని భూపతి, కొజ్జెర్ల బాసుదేవరావు, కొజ్జెర్ల నరసింహం, దూపాన అప్పయ్య, బూడెపు బాబుజ్జి, పొలి రమణ, పైల తులసి, పరపాటి లక్ష్మణరావు, నేరళ్ల చిరంజీవులు, గిరిడ కృష్ణారావు, కొమ్మూరి వెంకటరమణ, నేరళ్ల చిన్నారావు, ఇలుపూరు రోహిత్‌కుమార్, క్రాంతి శంకరరావు, మల్ల సింహాచలం, బుడ్డెపు జగదీష్, మల్ల కాంతమ్మ, సుగ్గు లక్ష్మీనారాయణ, బైరి జోగారావు, మండలి కామయ్య, ఎరుసు డిల్లేశ్వరరావు, జుజ్జు గోపాలు, గుంటి చిన్నారావు, ఊట్ల శంకరరావు, ఊట్ల చిన్నారావు, ఊట్ల పొలయ్య, అన్నపాన వినోద్‌కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్