జహీరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత: బీఆర్‌ఎస్ కార్యకర్త శేఖర్ ఆత్మహత్యపై ఆందోళన జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 29. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గం బిలాల్పూర్ గ్రామానికి చెందిన శేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. జాతీయ రహదారిపై మూడు గంటల పాటు రాస్తారోకో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త శేఖర్ ఆత్మహత్య ఘటన జహీరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ కేసు విషయంలో పోలీసులు శేఖర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మండలాల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై దాదాపు మూడు గంటల పాటు భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. శేఖర్ మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జహీరాబాద్ టౌన్ ఎస్సైతో పాటు సంబంధిత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్పష్టం చేశారు. శేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.