హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్

May 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యక పూజలలో , భజన కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.అనంతరం కమిటీ సభ్యులు ప్రేమకుమార్ ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, బండారు ప్రసన్నాంజనీయలు, తుంగం శ్రీనివాస్ రావు,బొల్లి శ్రీనివాస్ రావు, పవన్, తుంగ రామారావు, జల్ల రవి, ఆర్. జగన్నాథం, మధు,దేవాలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

📰 ePaper