రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి
జనం న్యూస్ మే 12 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది డాక్టర్ లక్ష్మణ్ రావు డాక్టర్ నిమ చిల్పిచేడ్ మండలంలోని రాందాస్గూడ గ్రామంలో 12.05.2026 నాడు అన్నదాతలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, పంటలలో యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువులను అవసరం మేరకు మాత్రమే వాడాలి మరియు జీవ ఎరువులు, పశువుల పెంట వాడడం మరియు సేంద్రియ పద్ధత్తుల వలన కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. నీమా మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి పంటలపై చర్చించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి రాజశేఖర్ మార్కెట్లో లభిస్తున్న పచ్చి రోట్ట మొక్క రకాలు పామ్ ఆయిల్ పంట సాగు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ సంజీవ్ రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారి కష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు