తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ :12 సెప్టెంబర్ శనివారం:సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై. రమేష్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశపు గొప్ప విద్యావేత్త, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 22 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణను అందించాలని సూచించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ “గురువు దైవంతో సమానం. తల్లి జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకత చేకూర్చేది గురువు” అని అన్నారు. “గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః.. గురుః సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః” అంటూ గురువు గొప్పతనాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప రమేష్, జెడ్సీ దాసరిపల్లి జ్యోతి, సెక్రటరీ మేడ శ్రీధర్, ట్రెజరర్ శ్రీనివాస్, లయన్ సభ్యులు భాస్కర్, నరసింహారెడ్డి, సురేష్, రవీందర్, రాంరెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు, సహ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్