పడంపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం

May 8, 2026 | వైరల్ వార్తలు

ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్

జుక్కల్ మే 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కల మండలం పడంపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ వాగు మరి విజయ కుమారి అధ్యక్షతన శుక్రవారం రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక ప్రోగ్రాం లో శుక్రవారం రోజు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు టీకాలు . నట్టల నివారణ మందులు మరియు పెంచే విధానంలో అవగాహన మరియు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు పథకాలను ఇట్టి కార్యక్రమంలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పౌడే సవిత బస్వంత్ వాడు సభ్యులు.మాజీ సర్పంచ్ గంగాధర్ మరియు గ్రామ ప్రజలు మండల పశు వైద్యాధికారి పండరినాథ్ పంచాయతీ కార్యదర్శి. గోపాలమిత్ర మండల బృందం పాల్గొనడం జరిగింది

🌐 Select Language:
📰 ePaper